KCR | ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి’.. ఇచ్చోడలో కేసీఆర్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
KCR | 'రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి' అంటూ ఉగాది పండుగ సందర్భంగా రైతులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో 'కేసీఆర్ సారే కావాలి', 'మళ్లీ కారే రావాలి' అని రాసి ఉన్న పోస్టర్లను రైతులు ప్రదర్శించారు.
హైదరాబాద్ : ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి’ అంటూ ఉగాది పండుగ సందర్భంగా రైతులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో ‘కేసీఆర్ సారే కావాలి’, ‘మళ్లీ కారే రావాలి’ అని రాసి ఉన్న పోస్టర్లను రైతులు ప్రదర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా లేక, రుణమాఫీ కాక, కరెంట్ సరిగ్గా రాక రైతుల బతుకులు ఆగమయ్యాయని, మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు నిజమైన పండుగ అని రైతులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు డిక్లరేషన్ పేరిట మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులకు టింగ్ టింగ్ అంటూ పంట పెట్టుబడికి రైతుబంధు వచ్చేదని, కాంగ్రెస్ పాలనలో పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని ముక్రా (కే) గ్రామ రైతులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విట్టల్, దత్త, వెంకటి, సంతోష్, మారుతి, రావ్ సాబ్, పలువురు మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

