Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలు వైరల్.. రాహుల్ మోదీతో పెళ్లి పీటలు ఎక్కుతుందా?
Shraddha Kapoor | బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. ‘సాహో’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా శ్రద్ధా కపూర్.. రాహుల్ మోదీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Shraddha Kapoor | బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. ‘సాహో’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా శ్రద్ధా కపూర్.. రాహుల్ మోదీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఇద్దరూ కలిసి బయట కనిపించడం, పలు ఈవెంట్లలో జంటగా హాజరుకావడం వల్ల వీరు డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, శ్రద్ధా కపూర్.. రాహుల్ మోదీ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పెళ్లి జరగవచ్చని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై కుటుంబ సభ్యులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. శ్రద్ధా ఆంటీ తేజస్విని ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, “ఈ విషయం నాకు తెలియదు” అంటూ నవ్వుతూ సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఆమె సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా ఈ వార్తలను సరదాగా కొట్టిపారేయడం అభిమానుల్లో సందేహాలు పెంచింది.
ఇప్పటికే ‘సాహో’ షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో శ్రద్ధా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తలను ఇద్దరూ ఖండిస్తూ తాము మంచి స్నేహితులమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అధికారికంగా ఏమీ చెప్పకపోయినా, శ్రద్ధా కపూర్- రాహుల్ మోదీల మధ్య బంధం బలంగా కొనసాగుతోందని వారి సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు వైరల్ అవుతుండటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, శ్రద్ధా కపూర్ ప్రస్తుతం మడాక్ ఫిలిమ్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ‘ఈత’ అనే బయోపిక్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నటిగా వరుస విజయాలు సాధించిన ఆమె, వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

