Union Govt : దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీల వద్ద ఉన్న చమురు, గ్యాస్ నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన, గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, సహజవాయువు సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కంపెనీలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) కి ఈ వివరాలు అందించాలని ఆర్డర్ వేసింది.