Mohan Babu | బర్త్డే స్పెషల్.. మోహన్ బాబుకి ‘ది ప్యారడైజ్’ టీమ్ అదిరిపోయే బహుమతి
The Paradise | టాలీవుడ్ లెజెండరీ నటుడు, 'కలెక్షన్ కింగ్' డా. మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
The Paradise | టాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘కలెక్షన్ కింగ్’ డా. మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ (Shikanja Maalik) అనే పవర్ఫుల్ మరియు డార్క్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ.. స్పెషల్ వీడియోను పంచుకుంది. ‘ఈతరం వారికి అసలు మోహన్ బాబు అంటే తెలియదు. ప్యారడైజ్ సినిమాతో మోహన్ బాబు అంటే ఎంటో చూపిస్తాం’ అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఈ వీడియోలో చెప్పుకోచ్చాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

