సూర్యాపేట : ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన మహానీయుడు కేసీఆర్(KCR) అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Guntakandla Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ (Deeksha Diwas) కార్యక్రమ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉద్యమ చరిత్రలో మరువలేని రోజు నవంబర్29 అని గుర్తు చేశారు. ఉద్యమ రథసారథి కేసీఆర్ దీక్ష భూని తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అన్న మాటే కోట్లాదిమందిని కదిలించిందని అన్నారు. రాబోయే రోజుల్లో రాబోయేది మళ్లీ కేసీఆర్ పాలనేనని ధీమాను వ్యక్తం చేశారు.
కేసీఆర్ అంటే తెలంగాణ పేగు బంధం.అభివృద్ధి, సంక్షేమాలే అజెండాగా ముందుకు పోయినం. కడుపు కట్టుకొని రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసినం. తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పదేండ్ల పాటు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని వినూత్న పథకాలతో ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకున్నారని కొనియాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో విలన్ పాలన నడుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని పేర్కొన్నారు.కేసీఆర్ పోరాటపటిమను, గొప్పతనాన్ని, ఈతరం యువతకు తెలియజేయాలని సూచించారు. దీక్ష దివాస్ రోజు కేసీఆర్ దీక్షకు సంభందించిన ఫొటో ప్రదర్శన చేయాలని,తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను ఆవిష్కరించాలని కోరారు.