సూర్యాపేట : బీజేపీ సహకారంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయాలని కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐ అప్పగిస్తే మేమే అరెస్ట్ చేస్తామని బండి సంజయ్ అంటున్నారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారని తెలిసే కుయుక్తులు పన్నుతున్నారన్నారు.
స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ లీడర్లు, గల్లీ నాయకులకు ప్రమోషన్లు రావడంతో తెలంగాణ ప్రజలకు కష్టాలొచ్చాయి. శనిగ్రహాలను వదిలించుకుని ఎప్పుడు తెలంగాణను కేసీఆర్‌కి అప్పగించాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యతలు మరచి దిగజారి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ భ్రమ పడుతుంది. దేశంలో మోదీ పని అయిపోయింది. ఇతరుల ఆక్సిజన్ మీద నడిచే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. దేవుళ్ల మీద విశ్వాసం లేని వాళ్లే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు. చెత్త మాటలు మాట్లాడకుండా దమ్ముంటే కుటుంబంతో బండి గుళ్లో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.