Inter Question Papers | ఆత్మకూరు యెస్. మండలం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు మండల కేంద్రానికి చేరుకున్నాయి. ఈ మేరకు వాటిని మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్ తేరాల ఉపేందర్ ఆధ్వర్యంలో క్వశ్చన్ పేపర్లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
పరీక్షా కేంద్రంలో 337 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు మొదటి సంవత్సరం నుండి పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో జిల్లా అధికారి బాను నాయక్ ఆధ్వర్యంలో పరీక్షలకుగాను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు కావలసిన టాయిలెట్స్ , రియల్ డెస్క్ వేయించులను తరగతి గదులను ఏర్పాటు చేశారు. పూర్తి వెలుతురు ఉండేటట్లుగా విద్యుత్ ఏర్పాటుతోపాటు ఎలాంటి ఇబ్బందులు ఫ్యాన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?