తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో సర్పంచ్ తప్పెట్ల ఎల్లయ్య ఇటీవల కాలుకు శాస్త్ర చికిత్స చేయించుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్ ఆయనను పరామర్శించి యోగక్షేమలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకులు సోమయ్య, బీఆర్ఎస్ పార్టీ మండలం అధికార ప్రతినిధి తునికి సాయిలు గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని కూడా పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్, దొంగరి శ్రీనివాస్, కొండగడుపుల నాగయ్య, యాకు నాయక్, హరీష్, సంతోష్, సాయి కిరణ్, మల్లేష్, వెంకటేష్, రచ్చ నవీన్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.