సూర్యాపేట : మహాత్మా గాంధీ (Mahatma Gandhi ) జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) నివాళి అర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదీష్ రెడ్డికి ముస్లిం, క్రైస్తవ సోదరులు శుభాకాంక్షలు తెలిపారు.