తుంగతుర్తి: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. క్యూలైన్లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పోలీసుల పహారా నడుమ యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.