సూర్యాపేట : సూర్యాపేటలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సకుటుంబసమేతంగా శమిపూజలో పాల్గొన్నారు. వేదిక పైనుంచి పావురాలు, బెలూన్లు గాల్లోకి ఎగురవేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంతోపాటు జమ్మిగడ్డలో జరిగిన శమిపూజ వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జమ్మిగడ్డలో ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి విశిష్టతను వివరించారు. ఈ వేడుకల్లో ఆయనతోపాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.