సూర్యాపేట: సూర్యాపేట జిల్లా (Suryapet) కేంద్రంలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో కన్న కూతురును హతమార్చాడో తండ్రి. పట్టణానికి చెందిన వెంకటేశ్ రోజూ మద్యం తాగివచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్‌ను ఆయన సతీమణి మందలిస్తున్నది. అదేసమయంలో 12 నెలల వయస్సున్న కూతురు భవిజ్ఞ ఏడుస్తుండటంతో ఆవేశానికి లోనైన అతడు.. చిన్నారి కాళ్లు పట్టి విసిరేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.