Donald Trump | అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనిపై అధ్యక్షుడు స్పందిస్తూ.. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తన చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదన్నారు.
అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘మాకు కార్మికులు అవసరం. మాకు గొప్ప కార్మికులు అవసరం. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే మా దేశానికి రావాలని కోరుకుంటున్నాను. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉన్నది.
Also Read..
H1B Visa Fee | హెచ్-1బీ వీసా దరఖాస్తులపై రుసుమును భారీగా పెంచిన ట్రంప్..
Dallas Airport | టెలికాం సర్వీసుల్లో అంతరాయం.. అమెరికాలో 1,800 విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
పాక్-సౌదీ ఒప్పందంలో మరిన్ని దేశాలు.. పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలు