H1B Visa Fee | హెచ్-1బీ వీసా దరఖాస్తులపై రుసుమును భారీగా పెంచిన ట్రంప్..
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉన్నది.
ప్రతి హెచ్-1బీ వీసాపై ఏడా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించామన్నారు. ఎరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక్కడి గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు ఇవ్వాలని కంపెనీలను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని సూచించారు. తాము తీసుకున్న నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. వారు చాలా సంతోషిస్తారని చెప్పారు. అయితే దీనిపై టెక్ కంపెనీలు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
హెచ్1బీ వీసా కింద ప్రత్యే రంగాల్లో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి ప్రతి ఏటా 65 వేల వీసాలను కంపెనీలకు ఇస్తారు. అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్న కార్మికులకు మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. వీటికోసం లాటరీలో ప్రవేశించడానికి చిన్న మొత్తంలో చెల్లిస్తే సరిపోయేది. ఆమోదం పొందిన తర్వాత ఏటా కొన్ని వేల డాలర్లు ఉంటుంది. ఈ మొత్తాన్ని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీసాలను మూడేండ్ల నుంచి ఆరేండ్ల కాలానికి ఆమోదిస్తారు. అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా కూడా హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లినవారే కావడం గమనార్హం. మోడల్ అయిన ఆమె 1996 అక్టోబర్‌లో వర్క్ వీసాపై అమెరికా వెళ్లి, అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ఇక ట్రంప్ మాజీ దోస్త్, టెస్లా సీఈవో, అపరకుబేరుడు ఎలాన్ మస్క్ కూడా హెచ్1బీ వీసా పొందినవారే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన అమెరికాకు వెళ్లి అక్కడే ఉండిపోయారు.
మరోవైపు ట్రంప్ గోల్డ్‌కార్డును కూడా ప్రకటించారు. దీనికి 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీనిద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉందని, వాటిని పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు గోల్డ్‌కార్డు నిధులను ఉపయోగిస్తామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

