Dallas Airport | అగ్రరాజ్యం అమెరికా (America)లో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. టెలికాం సర్వీసుల్లో సాంకేతిక సమస్య (Telecom Outage) కారణంగా డల్లాస్ సహా పలు ఎయిర్‌పోర్ట్స్‌లో దాదాపు 1,800కిపైగా విమానాల (flights)పై తీవ్ర ప్రభావం పడింది.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్ (Federal Aviation Administration) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డల్లాస్ సహా మరో రెండు విమానాశ్రయాల్లో (Dallas Airports) 1,800కిపైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. వందలాది విమానాలు రద్దయ్యాయి. ఎఫ్ఏఏ (FAA)తో సంబంధం లేని స్థానిక టెలిఫోన్ కంపెనీ పరికరాల్లో సమస్య కారణంగా సమస్య తలెత్తినట్లు ఎఫ్ఏఏ తెలిపింది. సమస్యను గుర్తించేందుకు టెలిఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది.
సాంకేతిక సమస్య కారణంగా డల్లాస్‌లో 20 శాతం విమానాలు రద్దైనట్లు ఫ్లైట్అవేర్ (FlightAware) తెలిపింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 200 కంటే ఎక్కువ విమానాలు రద్దైనట్లు పేర్కొంది. దాదాపు 500కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించింది. ఇక సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 1,100 కంటే ఎక్కువ లేదా షెడ్యూల్లో ఉన్న 27 శాతం విమానాలు ఆలస్యం అవుతున్నట్లు ఫ్లైట్ అవేర్ వివరించింది.
Also Read..
H1B Visa Fee | హెచ్-1బీ వీసా దరఖాస్తులపై రుసుమును భారీగా పెంచిన ట్రంప్..
Donald Trump | రష్యాపై ఆంక్షలకు యూకే ప్రధాని ఒకే చెప్పారు : డొనాల్డ్ ట్రంప్
Donald Trump : ఇండియా, మోదీ నాకు మంచి సన్నిహితులే: డోనాల్డ్ ట్రంప్