Jaish-e-Mohammed: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. అడ్డా మారుస్తున్న జైషే, హిజ్బుల్
Jaish-e-Mohammed: జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను మార్చుకుంటున్నాయి. ఇన్నాళ్లూ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఆ సంస్థలు ఇప్పడు తమ పర్మనెంట్ అడ్డాను ఖైబర్ ఫక్తున్క్వాకు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రేరేపిత జేషై మహమ్మద్(Jaish-e-Mohammed), హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను మార్చుకుంటున్నాయి. ఇన్నాళ్లూ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఆ సంస్థలు ఇప్పడు తమ పర్మనెంట్ అడ్డాను ఖైబర్ ఫక్తున్క్వాకు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని భారతీయ రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. చాలా వ్యవూహాత్మక రీతిలో ఈ ఉగ్ర సంస్థలు తమ స్థావరాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. భారతీయ దాడులకు పీవోకే అనువుగా ఉండడంతో ఆ సంస్థలు తమ స్థావరాలను మరో చోటుకు మారుస్తున్నాయి. ఖైబర్ ఫక్తునక్వా ప్రాంతం ఆఫ్ఘన్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఆ సంస్థలు భావిస్తున్నాయి.
ఆపరేషన్ సింధూర్ సమయంలో.. బహవల్‌పుర్, ముర్దికి, ముజాఫరాబాద్ పట్టణాల్లో ఉన్న ఉగ్రవాద కేంద్రాలను భారతీయ సైన్యం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉగ్ర సంస్థలు మకాం మారుస్తున్న విషయం ప్రభుత్వ అధికారులకు తెలుసు అని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర స్థావరాల తరలింపులో ప్రభుత్వం సహకరిస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా స్పష్టం అవుతోంది. పోలీసుల రక్షణలో జైషే సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
కేపీకేలోని మన్సెహరా జిల్లాలో ఉన్న గరి హబీబుల్లా పట్టణంలో జైషే మహమ్మద్ సంస్థ పబ్లిక్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన ఇండోపాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే ఈ ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది. మౌలానా ముఫ్తీ మసూద్ ఇలియాస్ కశ్మీరీ నేతృత్వంలో ఆ డ్రైవ్ జరిగినట్లు భావిస్తున్నారు. ఇలియాస్ కశ్మీరీ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. జైషే వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌తో అతనికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

