సూర్యాపేట: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని బీఆర్టీయూ ఆటో యూనియన్ (BRTU) అధ్యక్షులు కుర్రి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.10,116 చెక్కును మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే బీఆర్ఎస్ హయాంలో ఆటో యూనియన్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా వచ్చేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాద బీమా రావడం లేదని, ఇప్పటివరకూ రెన్యువల్ చేలేదని విమర్శించారు.
మహిళలకు ఫ్రీ బస్సు అని పెట్టి ఆటో కార్మికుల కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈనెల 27న భారీ బహిరంగ సభకు తరలి వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్టీయూ ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సీహెచ్ వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఎస్కె జాన్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు గూండా వెంకన్న, తండు శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పేరుమళ్ళ లింగయ్య, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్, గుణగంటి వెంకన్న, నరసయ్య, పబ్బు వెంకన్న, పాండు, ఎస్.కె గౌస్ పాష, బొమ్మగాని కృష్ణ, దుర్గం అంజి, తదితరులు పాల్గొన్నారు.