సూర్యాపేట : సీఎం రేవంత్ ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేటలో వందలాదిగా తరలివచ్చిన ఆశాలు నల్ల బ్యాడ్జీలతో ప్రధాన వీధుల మీదుగా నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేలు వేతనం ఇవ్వాలన్నారు. నెలల తరబడి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.