సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళలు, నాయకులు, కార్యకర్తలు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో గులాబీ గూటికి చేరారు. పట్టణంలోని 48వ వార్డు నుంచి బొమ్మిడి అశోక్, చెనగాని అంజమ్మ, సల్మా మస్తాన్, కాలరాం, దొండ శ్రీను, మేకల వెంకన్న, నిరంజన్, షేక్ యాకూబ్ పాషా ఆధ్వర్యంలో సుమారు 110 మంది BRS పార్టీలో చేరారు.
అలాగే 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్ సుమారు 40 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి BRS పార్టీలోకి వచ్చారు. ఈ సందర్బంగా మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ రాంచందర్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లులతో పాటు BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.