G Ramchandra Reddy : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తోంది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు జయకేతనం ఎగురవేస్తుండగా.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Guntakandla Jagadish Reddy) తండ్రి గంటకండ్ల రామచంద్రారెడ్డి (G Ramchandra Reddy) సర్పంచ్‌గా గెలుపొందారు. 95 ఏళ్ల వయసులో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మండల కేంద్రమైన నాగారం(Nagaram) సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తద్వారా రాష్ట్ర చరిత్రలో అత్యధిక వయస్కుడైన సర్పించ్‌గా రామచంద్రారెడ్డి రికార్డు నెలకొల్పారు.
తెలంగాణలో తొలి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా మొదటి దఫా ఎలక్షన్స్‌లో 84.28 పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88 ఓటింగ్ నమోదైంది. భద్రాద్దరి జల్లా కొత్తగూడెంలో అత్యల్పంగా 71.79 శాతం ఓటింగ్ రిజిష్టరైంది. ఆశ్చర్యంగా.. తొలి విడతలో మూడు సర్పంచి స్థానాలు లాటరీ ద్వారా తేలాయి.