శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Oct 28, 2020 , 00:21:55

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మునగాల  నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్‌ ఎడమ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ  రెగ్యులేటర్‌ వద్దకు కొట్టుకొచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయని, ప్యాంట్‌ ధరించాడని తెలిపారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ జాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మల్సూర్‌ తెలిపారు. మృతదేహాన్ని వెలికి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.