హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియగా, నేడు ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం వాతావరణం చల్లబడింది. సాయంత్రం సమయానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చెట్లు నేలకొరిగాయి.
ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజిగూడ, పంజాగుట్ట, కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, బోయిన్పల్లి, ఎల్బీనగర్, హయత్‌నగర్, సంతోష్ నగర్, దిల్సుఖ్నగర్, చార్మినార్, మెహిదీపట్నం, అఫ్జల్‌గంజ్, లక్డికాపూల్, టోలిచౌకి, ముసారాంబాగ్, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కొండాపూర్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. ఇక సిటీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా వర్షం కురియడంతో.. ధాన్యం తడిసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..