హైదరాబాద్ : గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే(Greenfield National Highway) భూనిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. హనుమకొండ జిల్లా( Hanumakonda) దామోర మండలం ఊరుగొండ వద్దగల జాతీయ రహదారిపై పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన(Farmers agitation) తెలిపారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. కాగా, రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి నిరసన విరమింపజేసి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.