హైదరాబాద్ : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉంటుంది. తనదైన హాస్య చతురోక్తులు, ఆటపాటలతో సందడి చేస్తుంటారు. యూత్‌లో ఉత్సాహాన్ని నింపుతుంటారు. తాజాగా మెట్రో రైల్లో(Metro train) ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రయాణించి హల్చల్ చేశారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం(Parliament Elections) నిర్వహించారు. హుషారుగా ఓటర్లను దగ్గరికి తీసుకుంటూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాగా, మల్లారెడ్డితో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపారు. మల్లారెడ్డి వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.