శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Mar 08, 2020 , 00:49:16

బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి

 బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : బ్రహ్మోత్సవాల సమగ్ర ఫలితాన్ని సకల లోకాలకు అం దించే విలక్షణమైన ఆగమశాస్త్ర వేడుక అష్టోత్తర శతఘటాభిషేకాన్ని శనివారం  వైభవంగా నిర్వహించారు. 108 కలశములతో అభిషేకించుటలో ఎంతో ప్రత్యేకత దాగి ఉంది. ఆగమశాస్ర్తాలు ఈ సంఖ్య నిర్దిష్టతను వివరించాయి. 25 తత్వములు, 3 గుణములు, 7 వారము లు,15 తిథులు, 27 నక్షత్రములు, 4 వేదములు, 3 కా లములు, 12 నెలలు ద్వాదశాధిపత్యులు కలిపి 108గా పేర్కొనబడ్డాయి. భగవానుడి సృష్టిలోని సమస్త జీవజలము ఈ 108లో అంతర్లీనమై ఉంది. శ్రీవారి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున కూడా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించడం ఆలయ ప్రత్యేకత. 


 శృంగార డోలోత్సవం..

శ్రీవారి బాలాలయంలో శ్రీలక్ష్మీనరసింహుల శృంగారడోలోత్సవం రాత్రి కనుల పండువగా అర్చకులు జరిపించారు. ఆలయ అర్చకులు, నాదస్వర బృందం, మంగళవాయిధ్యముల మధ్య లక్ష్మణాదేవి బృందములచే డోలోత్సవం నిర్వహించారు. పుష్పాలంకృతడైన ఊయలలో సర్పాలంకార శోభితుడై... శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని పట్టువస్త్రములతో అలంకరించి ఆలయ అర్చక బృందం ఈ వేడుకను నిర్వహిస్తారు. సంప్రదాయము ఊయలలో ఊగే దంపతులు శ్రీలక్ష్మీనరసింహులను స్మ రించిన, దర్శించిన సర్వశుభములు కలుగునని, సత్సంతతి, అనుకూల దాంపత్యము మొదలైన ఎన్నో విశేష ఫలితాలు పొందవచ్చునని వేదము పేర్కొంటుంది.  


భక్తజనులకు అన్నదానం..

ఆలయ సన్నిధిలో దేవస్థానం నిత్యన్నదానం నిర్వహించింది. సాధారణంగా  రోజూ 500 మంది భక్తులకు అన్నదానం చేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యా దాద్రికి వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి కల్పించింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి ముగిసేంతవరకూ భక్తులకు అన్నప్రసాదం అందజేశామని ఈఓ గీత తెలిపారు. 


పారాయణికులకు సన్మానం..

బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసిన పారాయణికులను ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహామూర్తి ఘనంగా సన్మానించారు. ప్రబంధ, ఇతిహాస, పురాణ, వేదపఠనములు, మూలమంత్రజపములు గావించిన యాజ్ఞికులు శేషంప్రణీతాచార్యులుతో పాటు బ్రహ్మోత్సవ సేవల్లో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించి పారితోషికం అందజేశారు. పోలీసు, దేవస్థానం సిబ్బందిని ఘనంగా సత్కరించారు. 


భానుడి భగ భగ..

ఎండలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ఎండలతో భక్తులు 

ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భ క్తులకు మండుటెండలో తిప్పలు తప్పలేదు. కార్యక్రమం లో ఏఈఓ ఆకుల చంద్రశేఖర్‌, దోర్బల భాస్కర్‌, వేము ల రామ్మోహన్‌, గజవెల్లి రమేశ్‌బాబు, పర్యవేక్షకులు రాజన్‌బాబు, డి. సురేందర్‌రెడ్డి, గజ్వేల్‌ రఘు, వేముల వెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.  logo