Games | క్రికెట్ అంటే పిచ్చి. కబడ్డీపై ఇష్టం. ఫుట్‌బాల్‌పై అభిమానం. ఆటలంటే ఇవే కదా! కానేకాదు. కానీ, ఇవే అని అనుకుంటాం. నిజానికి, ఇంకా చాలా ఉన్నాయి. ఒలింపిక్స్‌లో ప్రవేశించినా కూడా, మనకు తెలియని క్రీడలెన్నో ఉన్నాయి. అందులో ఓ ఐదింటి గురించి..

ఇదొక థ్రిల్లింగ్ ఔట్‌డోర్ గేమ్. రోమాంచితమే కాదు, ప్రమాదకరం కూడా. ఈ ఆటలో ఇస్త్రీ ఓ భాగం. ఆటగాడి చేతిలో ఆయుధం కూడా. కాబట్టే, ‘ఎక్స్ట్రీమ్ ఐరనింగ్’ అని పేరుపెట్టారు. పర్వతారోహణ, రేసింగ్, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటి క్లిష్టతరమైన టాస్క్‌లు ఎక్స్ట్రీమ్ ఐరనింగ్లోనూ ఉంటాయి. ఐరనింగ్ టేబుల్‌తో పాటు గమ్యస్థానానికి వెళ్లి.. అక్కడ టీషర్ట్నో, ప్యాంటునో ఇస్త్రీ చేసుకుని మళ్లీ వచ్చేయాలి. ఈ ఆట ఒంటరిగా లేదా సమూహాలుగానూ ఆడొచ్చు. నిత్యసాధన వల్ల శారీరక, మానసిక బలం పొందవచ్చు. అంతేకాదు, మంచి వినోదం కూడా. ఇది బ్రిటన్‌లో పుట్టింది. తర్వాత యునైటెడ్ స్టేట్స్, ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జర్మనీ దేశాలకు విస్తరించింది. ఈ ఇతివృత్తం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది.

ఈ ఆటను షిన్ డిగ్గింగ్స్ లేదా పర్రింగ్ అని పిలుస్తారు. ఇదొక యుద్ధ క్రీడ. ఇందులో ఇద్దరు సమ ఉజ్జీలు ఉంటారు. ఎవరికివారు తమ ప్రత్యర్థిని నేలమీదికి నెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకర్నొకరు తన్నుకుంటారు. ఆ నొప్పిని తట్టుకుంటూ ప్రత్యర్థిని మట్టి కరిపించే వరకూ ఆట కొనసాగుతుంది. కాలివేళ్లకు నొప్పి రాకుండా బూట్లలో గడ్డి పెడతారు. ఆటగాళ్లిద్దరూ తెల్ల కోటును ధరిస్తారు. 17వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లండ్‌లో పుట్టిందీ క్రీడ. 1850కి ముందు కోస్ట్ వరల్డ్ ఒలింపిక్ గేమ్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. మొత్తం పది పాయింట్లలో ఆరు వస్తే.. విజేతే. ఇదో ప్రాణాంతకమైన ఆట. జాగ్రత్తగా ఆడాలి.

దీన్నే కిక్ వాలీబాల్ అనీ పిలుస్తారు. బ్యాడ్మింటన్ కోర్టును పోలి ఉండే మైదానంలో ఇద్దరు మొదలు నలుగురు ఆటగాళ్లతో రెండు జట్లూ బంతాట ఆడతాయి. బంతిని తాకడానికి పాదాలు, మోకాలు, భుజాలు, ఛాతీ, తల మాత్రమే ఉపయోగించాలి. మొదటిసారిగా 1945లో పెనాంగ్‌లో ఈ ఆటను ప్రదర్శించారు. 1965లో కౌలాలంపూర్‌లో జరిగిన ఆగ్నేయాసియా క్రీడల్లో ప్రవేశపెట్టారు. సెపక్ తాక్రా మలేషియా జాతీయ క్రీడ. ఇండోనేషియా, సింగపూర్‌లో ‘సెపక్ రాగా’గా పిలుస్తారు. అక్కడ ఇదొక స్థానిక క్రీడ.

సంప్రదాయ క్రీడలైన చదరంగం, బాక్సింగ్ మిళితం చేసి రూపొందించిన హైబ్రీడ్ క్రీడ ఇది. ఈ ఆటలో ఇద్దరు ఆటగాళ్లు ఉంటారు. ఎవరో ఒకరు గెలిచేవరకు చెస్‌లో మాదిరి చెక్‌మేట్‌ను, బాక్సింగ్‌లో మాదిరి నాకౌట్నూ ప్రయత్నించవచ్చు. ప్రత్యామ్నాయ రౌండ్లుగా ఈ రెండిటినీ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెస్ రౌండ్ డ్రా అయితే బాక్సింగ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇందుకోసం చెస్, బాక్సింగ్ పరికరాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆట నియమాలను మొదటగా ఫ్రెంచ్ కామిక్ కళాకారుడు ఎన్కీ బిలాల్ రూపొందించారు. బాక్సింగ్ క్లబ్లో చెస్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఈ ఆలోచన వచ్చినట్టు చెబుతారు.

స్నోబాల్ ఫైటింగ్ అని కూడా పేరు. ఈ ఆట జపాన్‌లో పుట్టింది. మంచుబంతులతో ఒకరిని ఒకరు కొట్టుకునే వినోద క్రీడ ఇది. చలి కాలంలో ఎక్కువగా ఆడతారు. మొదట్లో ఏదో సరదా ఆటగా భావించేవారు. తర్వాత అధికారికంగా గుర్తించారు. రెండు జట్ల మధ్య ఈ పోరు నడుస్తుంది. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులు ఉంటారు. ఒకరిమీదికి ఒకరుకరు స్నోబాల్స్ విసురుకుంటారు. దెబ్బలు తగలకుండా హెల్మెట్స్ ధరిస్తారు. జపాన్ యుకీగాసెస్ నియమావళి ప్రకారం విజేతలను నిర్ణయిస్తారు.
షుగర్ పేషెంట్ల కోసమే ఈ చెప్పులు.. వీటి స్పెషాలిటీ ఏంటంటే..