ఫొటోలో కనిపిస్తున్నవి ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు కాదు.. ఇవి కొత్తరకం కేకులు !!
Hyper Realistic Cakes | ఆ ఉల్లిపాయలను తరుగుతుంటే, కళ్లవెంబడి నీళ్లు రావు. ఆ వంకాయలను కోసి ఎంత సేపైనా సరే కనరు రానేరాదు. ఎందుకంటే..రకరకాల పండ్లు, కూరగాయలు, విభిన్న ఆహార పదార్థాలను పోలిన ‘హైపర్ రియలిస్టిక్ ఫుడ్ కేక్స్' అవి!
Hyper Realistic Cakes | ఆ ఉల్లిపాయలను తరుగుతుంటే, కళ్లవెంబడి నీళ్లు రావు. ఆ వంకాయలను కోసి ఎంత సేపైనా సరే కనరు రానేరాదు. ఆ యాపిల్ ముక్కలకు గాలి తగిలినా ఎరుపు రంగులోకి మారవు. ఎందుకంటే..రకరకాల పండ్లు, కూరగాయలు, విభిన్న ఆహార పదార్థాలను పోలిన ‘హైపర్ రియలిస్టిక్ ఫుడ్ కేక్స్’ అవి!

కేకును కేకులానే తయారు చేయాలా.. చాకులా, బాకులా, మేకులా చేయకూడదా? అనే కెవ్వు కేక ఐడియా వచ్చిందో పాక నిపుణుడికి. కేకు అనేది ప్రాథమికంగా ఓ తినే పదార్థం కాబట్టి దాన్ని ఆహారంలానే తయారు చేయాలనుకున్నాడు. అలా ఆలోచించీ చించీ..బుర్రతో పాటు ఓవెన్కూ, క్రీముకూ పనిచెప్పి తన అద్భుతమైన ఐడియాను అత్యద్భుతంగా ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అంటే.. కేకు అడుగున పెట్టే ప్లేటూ, దాంతోపాటూ కేకు తయారయ్యాక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ పెట్టడానికి ఫొటోలు తీసేందుకు ఫోనూ, కెమెరాలూ గట్రా అన్నమాట. అలా మొత్తానికి తను అనుకున్నది పూర్తి చేసేందుకు పనిని భుజాన వేసుకున్నవాడై నెమ్మదిగా ఓవెన్వైపు అడుగులు వేశాడు. అప్పుడు తయారైనవే… ఇక్కడ కనిపిస్తున్న హైపర్ రియలిస్టిక్ కేకులు. ఒక్కరే తయారు చేస్తే అన్ని చిత్రాలు రావు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేకర్లు అంతా ఈ తరహా కేకుల తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రజలను ఆకట్టుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే యాపిల్, దానిమ్మ, అరటిలాంటి పండ్లూ, వంకాయ, క్యాప్సికమ్, ఉల్లిలాంటి కూరగాయలూ, ఇవి కాక ఫ్రెంచ్ ఫ్రైలూ, బర్గర్లూ, కోక్లూ… అన్నీ తయారయ్యాయి.

ఎలా చేస్తారంటే…
వీటి లోపల ఉండే కేకును వెనీలా, బటర్‌స్కాచ్, బ్లాక్ కరెంట్… ఇలా నచ్చిన ఫ్లేవర్‌లో తయారు చేసుకోవచ్చు. దాన్ని సరైన ఆకృతిలో కత్తిరించడం, దానిమీద ఫాండెంట్ను అమర్చడం, హైపర్ రియలిస్టిక్‌గా కనిపించేలా రంగులు అద్దడం.. చాలా కష్టమైన పని. దీనికంటూ నైపుణ్యం కావాలి. ఇందుకు రకరకాల పదార్థాలను వాడతారు. ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్న ఉల్లిగడ్డను తీసుకుంటే.. దాని లోపల ఉన్నది మామూలు స్పాంజి కేకే అయినా, ఉల్లిపొరలను అచ్చు గుద్దినట్టు తయారు చేయడానికి ప్రత్యేకించి వేఫర్ పేపర్ వాడారు. దానిమీద బ్రష్‌తో జెల్ రంగులను అద్దారు. పేపర్‌ను ఉల్లిగడ్డ మీద ఉంచి రంగులు అద్దడం వల్ల ఆకృతి కూడా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట! ఇలాంటి హైపర్ రియలిస్టిక్ ఫుడ్ కేకులు తయారుచేసే బేకర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. వీటి తయారీ వీడియోలకూ మంచి స్పందన వస్తున్నది. ప్రత్యేక సందర్భాల్లో ఆత్మీయులను ఆశ్చర్య పరచడానికి ఈ తరహా కేకులు ఆర్డరు పెడుతుంటారు కస్టమర్లు. నిజమే చేయడం వాళ్లవంతయితే, అవాక్కవడం మనవంతు.. అంతేగా?!

Read More :
“వెన్నతో ఈ రుచులను ఎప్పుడైనా టేస్ట్ చేశారా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

