మిథిల ప్రాంతంలో మాత్రమే దొరికే వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి ఎందుకంత ప్రత్యేకం?
Mithila Makhana ( Fox Nut ) | బీహార్‌లోని మిథిల ప్రాంతంలో పండించే ‘మిథిల మఖానా’ (కలువ గింజలు)కు భారత ప్రభుత్వం భౌగోళిక గుర్తింపును (జీఐ) ఇచ్చింది. పేరుకు తగినట్టే ఈ మఖానా మిథిలతో పాటు నేపాల్‌లో పండుతుంది. బీహార్ నుంచి జీఐ గుర్తింపు పొందిన ఐదో ఆహార పదార్థం మిథిల మఖానా. భగల్పూర్ జర్దాలు మామిడి, కటార్ని ధాన్ (వడ్లు), నవడా మాఘాయి తమలపాకులు, ముజఫర్‌పూర్ షాహీ లిచ్చీ ఇంతకుముందే జీఐ గుర్తింపు పొందాయి. మిథిల మఖానాను సంక్షిప్తంగా ‘మఖాన్’ అంటారు. దీని శాస్త్రీయనామం ‘యూర్యేల్ ఫెరోక్స్ సాలిస్బ్’. ఇది నీళ్లలో పెరిగే కలువ గింజల రకానికి చెందింది. ఇంగ్లిష్‌లో ‘ఫాక్స్నట్’ అని పిలుస్తారు. ఇవి కొలనులో పత్రాల మీద పెరుగుతాయి. వాటిని సేకరించి, కడిగి కొన్ని గంటలపాటు ఎండపెడతారు. ఆ తర్వాత వాటిని ఎక్కువ మంటమీద బాణలిలో వేయిస్తారు. దీంతో వాటి పెంకులు పేలి, పేలాల్లా తయారవుతాయి.

కోజాగరి పూర్ణిమ పూజ సందర్భంగా మిథిలవాసులు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రత్యేకించి నవ దంపతులతో తినిపిస్తారు. మఖానా ఆరోగ్యకరమైన చిరుతిండి. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, జింక్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువే కాబట్టి, బరువు తగ్గడానికీ దోహదపడతాయి. మసాలా దినుసులు చల్లుకొని తింటే మహా రుచికరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల నిద్రలేమి, కీళ్లనొప్పులను అధిగమించవచ్చని అంటారు. మెదడు సామర్థ్యం కూడా మెరుగుపడుతుందట!
Read More :
“FOX NUTS: నిద్రలేమి, గుండెదడకు చెక్‌పెట్టే గింజలు!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

