Breakfast | రోజూ ఉదయం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలా?
Breakfast | మూడుపూటలా తింటున్నా సరే, ఆ రోజు తొలిసారిగా తీసుకునే అల్పాహారమే ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. సమయానికి తగినంత బ్రేక్‌ఫాస్ట్ పొట్టలో పడకపోతే జీవక్రియ దెబ్బతింటుంది.
సరిపడా తీసుకోండి
కొంతమంది ఓ గ్లాసు పాలతోనో, ఓ చిన్న పండుతోనో అల్పాహారం ముగించామనుకుంటారు. ఇలా చేయడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. కనిపించినవన్నీ తినేస్తాం. దీంతో బరువు పెరిగే ఆస్కారం ఉంది. గంటలకొద్దీ ఆకలితో ఉంటే పనుల మీద ఏకాగ్రతా సన్నగిల్లుతుంది.
గబగబా వద్దు
ఆహారం తింటున్నప్పుడు ప్రశాంత వాతావరణం ఉండాలి. హడావుడిగా పెద్దపెద్ద ముద్దలు మింగితే.. మోతాదుకు మించి తినేస్తామని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే నెమ్మదిగా నమిలి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.
ప్రొటీన్లు ఉండేలా
కేవలం పొట్ట నింపుకోవడానికే అన్నట్టు కాకుండా ప్రొటీన్లు, మంచి కొవ్వులు కలగలిపిన అల్పాహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లతో కూడిన ఆహారం చాలాసేపు ఆకలిని దూరం చేస్తుంది. ఒంటికి బలాన్నీ ఇస్తుంది. సోయా, పప్పు గింజలు, పాలు, పనీర్, గుడ్డు తదితర అధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎంచుకోవచ్చు.
కార్బొహైడ్రేట్లు కూడా..
కొంతమంది డైటింగ్‌లో భాగంగా కార్బొహైడ్రేట్లను దాదాపుగా తీసుకోవడం మానేస్తారు. పూర్తిగా ప్రొటీన్ల మీదే ఆధారపడితే రక్తంలో చక్కెర శాతం పడిపోతుంది. అందువల్ల ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవాలి. వారంలో కొన్ని రోజులయినా ఉప్మా, అటుకులు, ఓట్స్ లాంటివి తినాలి.
కొవ్వులూ మంచివే
ఉదయపు ఆహారంలో నెయ్యి, వెన్న, వేరుశనగలు, అవిసెలు లాంటివి చేర్చడం వల్ల శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లూ, అసంతృప్త కొవ్వులూ గుండెకు మేలు చేస్తాయి.
ఎప్పుడూ మానొద్దు
ఉదయం హడావుడిగా బయటికి వెళ్లాల్సి వచ్చిందనో, రాత్రి ఆలస్యంగా తిన్నామనో, లేదంటే తినడం మానేస్తే క్యాలరీలు తగ్గించుకోవచ్చనో.. రకరకాల కారణాలతో చాలా మంది అల్పాహారం మానేస్తూ ఉంటారు. కానీ జీవక్రియ మీద ఇది దుష్ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో కొవ్వుశాతం పెరగడం, గుండె సమస్యలు, మధుమేహం తదితర ఇబ్బందులకు కారణం అవుతుంది.
Read More :
“ఈ ఫుడ్ తింటే అలర్జీలు అవుతున్నాయా? అయితే జాగ్రత్త !!”
సూప్ అంటే వేడిగానే ఉంటుందా.. సమ్మర్ స్పెషల్ చల్లచల్లని సూపులు వచ్చేశాయ్!!”
Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!”
“Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- breakfast
- Food
- Health
- Healthy food
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

