Black Food Health Benefits | ముదురు వర్ణాల్లోని ఆహార పదార్థాలలో పోషక విలువలు ఎక్కువని అంటారు. అందులోనూ కారుమబ్బు రంగులో ఇంకొంత అధికమని చెబుతారు. సాధారణంగా, ఆంథోసైనిన్స్ అనే పిగ్మెంట్స్ ఉన్న ఆహారాలను ‘బ్లాక్ ఫుడ్స్’గా వ్యవహరిస్తారు. నలుపు, నీలం, ఊదా ఆహారాల్లో ఆంథోసైనిన్స్ కనిపిస్తాయి.
ఒమేగా -3 ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అధికంగా ఉండే బ్లాక్ వాల్నట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్‌నట్స్‌లో ఎల్లాజిక్ యాసిడ్ పుష్కలం. ఇది గుండెకు రక్షణ కవచం. వీటిలో మెలటోనిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అపారం.
ఆగ్నేయాసియాలో ఎక్కువగా పండే బ్లాక్ రైస్‌లో లూటిన్, జియాక్సంథిన్ అధికం. ఇవి కంటికి మేలు చేస్తాయి. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్స్, ఫైబర్ శాతం కొంత ఎక్కువే.
నల్ల పప్పు, నల్ల నువ్వులు, నల్ల ద్రాక్ష, బ్లాక్ ఆలివ్ తదితరాలలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్-ఇ, పాలీఫెనాల్స్ పుష్కలం. ఇవి చర్మ, కేశ సంరక్షణకు
తోడ్పడతాయి.
వెల్లుల్లి తెల్లగానే ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలను పులియబెడితే నల్లగా మారతాయి. వీటిని వేపుళ్లు, నూడుల్స్, సూప్ తయారీలో రుచిని పెంచడానికి వాడతారు.
బ్లాక్ ఫిగ్స్, బ్లాక్ బెర్రీస్, బ్లాక్ డేట్స్, బ్లాక్ యాపిల్ వంటి వాటిలో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్, విటమిన్లు, డైటరీ ఫైబర్ పొంగిపొర్లుతాయి. వీటిలోని సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్నీ అరికడుతుంది.
యాక్టివేటెడ్ చార్కోల్తో తయారయ్యే బ్రెడ్, ఐస్‌క్రీమ్, పాస్తా, బిస్కెట్స్, మోమోస్‌కు కూడా మార్కెట్లో గిరాకీ ఉంది. .. ఆలస్యమెందుకు, మేఘవర్ణంపై మీరూ మోజు పెంచుకోండి. పళ్లాన్ని నల్లనల్లగా ముస్తాబు చేసుకోండి.
మిథిల ప్రాంతంలో మాత్రమే దొరికే వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి ఎందుకంత ప్రత్యేకం?”