Pakodi | పకోడీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఉల్లిపాయ పకోడీ ఒక్కటే. నిజానికి అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలతో పకోడీలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ట్రెండ్! పచ్చిమిరపకాయ, ఆలుగడ్డ, అరటికాయ, దొండకాయ, బెండకాయ, సొరకాయ, వంకాయ, బీరకాయ, టమాట, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్.. ఇలా కూరగాయ ఏదైనా సన్నగా తరిగేసి తగినంత శనగపిండి, బియ్యపుపిండి వేసి క్షణాల్లో పకోడీలు వేస్తున్నారు ఆధునిక షెఫ్‌లు. అంతేకాదు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలూ పకోడీ మహాయజ్ఞంలో భాగం అవుతున్నాయి.
ఎగ్, చికెన్, ఖీమా, రొయ్యలు, చేపలు కూడా ‘మేము సైతం’ అంటున్నాయి. తమలపాకులు, యాపిల్ పండ్లతోనూ ట్రై చేస్తున్నారు. తాజాగా తామర కాండం, జీడిపప్పు, పనసకాయ, మందార పూలు, శనగలు వంటి వాటితోనూ కరకరలాడే పకోడీలు చేస్తూ వెరైటీ రుచులతో కాదేది పకోడీకి అనర్హం అని నిరూపిస్తున్నారు.
“Thunder Mushroom | ఈ పుట్టగొడుగులు ఎందుకంత స్పెషల్.. ఇవి అన్నిచోట్ల ఎందుకు దొరకవు?”