Ice Cream Idli | ఇడ్లీ అనగానే నిండు చందమామలా తెల్లగా, గుండ్రంగా ఉన్న రూపమే కండ్లముందు కదలాడుతుంది. కాబట్టే, కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామని అనుకున్నాడు ఓ బెంగళూరు వాసి. తను చేసే చాకోబార్ ఐస్‌క్రీమ్ ఇడ్లీలకు మంచి గిరాకీ ఉంది. వీటిని చేత్తో ముట్టుకోవాల్సిన పన్లేదు. పుల్లతో పట్టుకుని.. సాంబార్లో, చట్నీలో చక్కగా ముంచుకుని తినేయవచ్చు. ఆ మధ్యన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ట్విటర్ వేదికగా ఈ ఇడ్లీలను తెగ మెచ్చుకున్నారు.
అలాగే, అచ్చంగా ఐస్క్రీమ్తోనూ ఇడ్లీలను వడ్డించి కొత్తకొత్త రుచులను పరిచయం చేస్తున్నాడు ఓ ఇడ్డెన ప్రియుడు. బెంగళూరులోని జయనగర్‌కు చెందిన ఓ వీధివ్యాపారి చల్లటి ఐస్‌క్రీమ్‌తో తియ్యటి ఇడ్లీలను జతచేసి అమ్ముతున్నాడు. వెనిలా, చాక్లెట్.. ఇలా రకరకాల ఫ్లేవర్లతో అందిస్తున్నాడు.