ఇలా మామిడి పండ్ల రుచిని ఏడాదంతా ఎప్పుడైనా ఆస్వాదించొచ్చు !
Spray Dried Fruit Powders | ఏడాదంతా నిల్వ ఉండేలా మామిడికాయ వరుగులూ, టమాట వరుగులూ పెట్టుకుంటాం. ఉసిరికాయ పొట్టు పచ్చడి చేసుకుంటాం. చింతకాయ దంచి పక్కకు పెడతాం. చల్ల మిరపకాయలు ఊరబెడతాం. మరి పండ్ల పరిస్థితి ఏంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫ్లేవర్‌తో ఆహారం ఆస్వాదించాలంటే ఎలా? అందుకే పండ్లను కూడా ఎండబెట్టి పొడి చేస్తున్నారు. ‘ఫ్రూట్ పౌడర్స్ ( Fruit Powders )’ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారు.

పండ్లలోని విటమిన్లు, ఖనిజలవణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. కానీ వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోలేం. పండుగా ఉన్నప్పుడు మహా అయితే ఓ వారం రోజులు మాత్రమే నిల్వ ఉంచుకోగలం. అలా అయితేనే రుచికరంగా తినగలం. అదే రుచితో, అందులోని పోషకాలన్నీ ఎక్కువకాలం నిల్వ ఉండేలా దొరుకుతున్నాయి ‘స్ప్రే డ్రైడ్ ఫ్రూట్ పౌడర్లు ( Spray Dried Fruit Powders )’. విదేశాల్లోనే కాదు, మన దగ్గర కూడా పలు సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నాయి.

సహజత్వం పోకుండా, అదనపు రంగులు, చక్కెరలు కలపకుండా సహజ పద్ధతుల్లో వీటిని రూపొందిస్తున్నారు. పండ్ల రకాన్నిబట్టి ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి పొడి చేస్తారు. సరైన పద్ధతుల్లో తయారుచేస్తే ఈ పొడులు ఆరు నెలల నుంచి ఏడాది వరకూ నిల్వ ఉంటాయి. ఓపికుంటే ఇంట్లో కూడా పండ్ల పొడులను చేసుకోవచ్చు. దానికోసం డీహైడ్రేటర్ (వరుగులు చేసేందుకు ఉపయోగించే యంత్రం) అవసరం అవుతుంది. అది ఉంటే పండ్లను ముక్కలుగా చేసి అందులో 52 డిగ్రీల సెంటీగ్రేడుల దగ్గర ఎండబెట్టాలి. లేదంటే ఓవెన్లోనైనా వరుగులు చేయొచ్చు. తర్వాత బాగా పొడి చేసి, జల్లెడ పట్టి గాలి చొరబడని డబ్బాలో పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇక, మార్కెట్లో దొరికే వాటిలో మామిడి, జామ, ఆపిల్, పైనాపిల్, బొప్పాయి, సీతాఫలం, అరటి, కమలా, స్ట్రాబెరీ, రాస్బెర్రీ… ఇలా అన్ని రకాల పండ్ల పొడులూ ఉంటున్నాయి. వీటిని పాలు లేదా పెరుగులో కలుపుకొని, ఓట్స్‌లో వేసుకుని తినొచ్చు. ఫ్లేవర్డ్ టీల కోసం, ఐస్‌క్రీమ్‌లలో, కేకులూ బిస్కట్ల తయారీలోనూ, పసిపిల్లల ఆహారంలోనూ ఇతర పానీయాల తయారీలోనూ ఉపయోగించొచ్చు. అటు రుచి ఇటు ఆరోగ్యం కలగలిపిన ఫ్రూట్ పౌడర్లకు మార్కెట్లో ఇప్పుడు గిరాకీ ఉన్నది.


Read More :
T Kitchen | ఈ రెస్టారెంట్ గేటు మొదలు నేల, కుర్చీలు, లైట్లు.. అన్నీ గులాబీ రంగులోనే ఉంటాయి”
The Cumin Club | అమ్మ చేతి వంటను మిస్సవుతున్నారా? ఇక బెంగ పడనక్కర్లేదట !!”
“వీళ్లు వంట చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

