Pink Wasabi Restaurant | మహిళల అభిమాన వర్ణం పింక్. అందంతోపాటు ఆహ్లాదాన్నిచ్చే గులాబీ రంగు అంటే పెద్దలకూ ఇష్టమే. ముంబైకి చెందిన ప్రసూక్ జైన్ మాత్రం తన ఇష్టాన్ని తన వ్యాపారంలో భాగం చేసి ‘పింక్ వసాబి’ అనే రెస్టారెంట్ ప్రారంభించాడు.
రెస్టారెంట్ గేటు మొదలు నేల, పైకప్పు, కుర్చీలు, బల్లలు, లైట్లు.. అన్నీ గులాబీ రంగు మేళవించే ఉంటాయి. పైకప్పు, ఎలివేషన్ ఏరియాల్లో అచ్చంగా గులాబీలనే గుచ్చినట్లు డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ వడ్డించే ఆహారం కూడా దాదాపు గులాబీ రంగులోనే ఉంటుంది. ఎరుపు రంగు పండ్లు, కూరగాయలతోపాటు రెడ్ ఫుడ్ కలర్నుఉపయోగించి మాంసాహారం, శాకాహారం అనే తేడా లేకుండా అన్నిటినీ గులాబీ వర్ణంలోకి మార్చేస్తారు. ఇక్కడ వడ్డించే వాటిలో రాస్బెర్రీ, ఆపిల్, చెర్రీ వంటి ఎరుపు రంగు పండ్లే ఎక్కువగా కనిపిస్తాయి. మాక్టెయిల్స్ కూడా గులాబీ రంగులోనే, చివరికి టిష్యూలు కూడా!
ఈ రెస్టారెంట్‌కి వెళ్తే గుహలో కూర్చొని తిన్నట్టే ఉంటుంది!!”
“రోబో రెస్టారెంట్ : రోబోలతో ఆహారం సరఫరా!”
ఈ జైలు భోజనం చాలా టేస్టీ !! మీరూ టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా?”