T Kitchen | హైదరాబాద్‌లో రెట్రో స్టైల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న రెస్టారెంట్.. ఇక్కడ స్పెషల్ ఏంటంటే..
రెస్టారెంట్ : ఒక టీ అండ్ కాఫీ ( Okati Coffee )
Okati Coffee | ఉరుకులు పరుగుల జీవితం, హోరెత్తించే ట్రాఫిక్ మోతల్లోనూ ప్రశాంతంగా చిక్కని కాఫీని ఆస్వాదించే వాతావరణాన్ని కల్పిస్తున్నది.. ‘ఒకటి కాఫీ(Okati Coffee)’. హైదరాబాద్ శివారు కౌకూర్‌లోని ఈ రెస్టారెంట్ ఇంటీరియర్స్ చెక్క ఫర్నిచర్, ఇటుకల గోడలు, కామిక్ బుక్ థీమ్‌తో ఆహ్లాదంగా అనిపిస్తాయి. అంతేకాదు మాక్‌టెయిల్, కోల్డ్ కాఫీలను అందించే గ్లాసులను పాతకాలంనాటి ట్రంకు పెట్టెల్లో అమర్చి.. చిన్నప్పటి రోజుల్ని గుర్తుచేస్తున్నారు నిర్వాహకులు. ‘ఒకటి కాఫీ’ అంటే ‘ఒక టీ మరియు కాఫీ’ అంటూ కొత్త అర్థం చెబుతున్నారు వ్యవస్థాపకులు వినాయకరావు. కాంటినెంటల్, చైనీస్ మెనూ ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. అంతేకాదు పాస్తా, పిజ్జా, బర్గర్ వంటి ఆధునిక రుచులను, బ్రౌనీ విత్ ఐస్‌క్రీం వంటి వెరైటీలనూ వడ్డిస్తున్నారు. వెజ్ మంచూరియా, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్, ఫిష్ అండ్ చిప్స్ రుచి అదుర్స్ అంటున్నారు సందర్శకులు. ఒక వారాంతం ప్లాన్ చేసుకోండి మరి.

సెలెబ్రిటీ : ఇష్టమే కానీ..
బూరెల్లాంటి బుగ్గలతో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. కెరీర్ తొలినాళ్లలో కాస్త బొద్దుగా ఉండేది రాశి. వ్యాయామంతోపాటు తగిన డైట్ పాటించి మహా నాజూకుగా తయారై వరుస అవకాశాలను దక్కించుకుంటున్నది. ఆహారం విషయంలో తను కాస్త కఠినంగానే ఉంటుంది. మెరుపుతీగలా కనిపించాలనే ఆరాటం వల్ల తనకు ఇష్టమైన పదార్థాలను కూడా దూరం చేసుకున్నది. అయితే అప్పుడప్పుడూ తనకు బాగా ఇష్టమైన లెబనీస్, చైనీస్ వంటకాల్ని గుట్టుచప్పుడు కాకుండా లాగిస్తున్నది. టిక్కాలు, మోమోస్, చికెన్ తందూరీని ఎక్కువగా ఇష్టపడుతుందీ అందాల రాశి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Coffee
- Hyderabad
- Restaurant
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!


