Dog’s Food | మనుషులు తినే ఆహారం శునకాలకు మంచిదేనా?
Dog’s Food | మనదేశంలో జంతుప్రేమికులు చాలామందే ఉన్నారు. వారు తినే ప్రతీ ఆహారాన్ని పెంపుడు జంతువులకు పెట్టి తృప్తి పడుతుంటారు. అలా కొన్ని పండ్లు తినడం వల్ల జంతువులు అనారోగ్యానికి గురైనట్లు తేలింది. అయితే అన్ని పండ్లు, కూరగాయలతో అలా జరుగదు. మనుషులు తినే ఆహారపదార్థాలలో ఏవేం తింటే కుక్కలకు మంచిదో తెలుసుకోండి.
పుచ్చకాయ : ఇది ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్ ఎ, బి6, సి, పొటాషియంలాంటివి ఉన్నాయి. కేలరీలు, పోషకాలు తక్కువగా కలిగి ఉంటాయి. వేసవిలో కుక్కకు పుచ్చకాయను తినిపిస్తే వెచ్చని వాతావరణంలో కూడా చల్లబరుస్తుంది.
బ్లూబెర్రీ : వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇది మానవ ఆరోగ్యానికి అద్భుతమైన పండు. చిన్న కుక్కలకు బ్లూబెర్రీలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి.
ఆపిల్ : మనిషికి, కుక్కలకు రుచికరమైన పండు ఆపిల్. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, సి, ఒమెగా-3, ఒమెగా-6, యాంటీఆక్సిడెంట్, ప్లేవనాయిడ్, పాలీఫెనాల్ ఉన్నాయి. కానీ, కుక్క ఆపిల్ విత్తనాలు తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే విషపూరితంగా మారుతుంది.
క్యారెట్ : కుక్కలకు క్యారెట్ అద్భుతమైన ఆహారం. క్యారెట్లను పచ్చిగా, వండినట్లుగా ఎలాగైనా తినిపించవచ్చు. కానీ కుక్క ఆహారంలో క్యారెట్ ఒక భాగం మాత్రమే.
బీన్స్ : వీటిలో చాలా పోషకాలున్నాయి. విటమిన్ ఎ, సి, కె, ఫోలిక్ ఆమ్లం, మెగ్నీషియం, క్యాల్షియం, చక్కెర, పొటాషియం లాంటివి ఉన్నాయి. కుక్కలకు బీన్స్‌ను ఉపయోగించే జంతుప్రేమికులు తక్కువగా ఉంటారు. వీటితోపాటు ఉప్పు, మసాలా జోడించవద్దు.
వీటితోపాటు ఆకుకూరలు, గుమ్మడికాయ గింజలు, చికెన్ ముక్కలు, చికెన్ ఉడికించిన పులుసు, చేపలు. ఇవన్నీ మనిషి ఆహారంగా తీసుకుంటారు. వీటిని ఆహారంగా కుక్కలకు పెట్టవచ్చు.
ఇవ్వకూడని ఆహారం : ఎండుద్రాక్ష, ద్రాక్ష ఇవ్వకూడదు. అదేవిధంగా ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అవకాడో, చక్కెర పదార్థాలు కలిగున్న ఆహారం వాటికి పెట్టకూడదు.
Read More :
రూ.12 లక్షలకు పైగా ఖర్చు చేసి… కుక్కగా మారిన మనిషి”
dog suicide bridge | 70 ఏండ్లలో 600 కుక్కలు ఆత్మహత్య”
Ayurvedham | పెంపుడు కుక్కలకూ ఆయుర్వేదం!”
మనుషులే కాదు శునకాలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నాయి.. రీజనేంటో మరి !!”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

