రూ.12 లక్షలకు పైగా ఖర్చు చేసి… కుక్కగా మారిన మనిషి
టోక్యో: ఒక వ్యక్తి అచ్చం కుక్కలా మారాడు. దీని కోసం రూ.12 లక్షలకు పైగా వెచ్చించాడు. అయితే అతడు నిజంగా కుక్క కాలేదు. కుక్కలా అవతారమెత్తాడు. జపాన్కు చెందిన టోకోకు నాలుగు కాళ్లున్న జంతువుగా మారిపోవాలన్న కోరిక కలిగింది. అయితే కుక్క రూపమైతే తనకు సరిగ్గా సరిపోతుందని అతడు భావించాడు. దీంతో ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క ‘కోలీ’గా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించాడు.
కాగా, జపాన్లో పలు సినిమాలు, టీవీ షోలు, వినోదాత్మక కార్యక్రమాలకు కాస్ట్యూమ్స్, మస్కట్ పాత్రల దుస్తులను జెప్పెట్ సంస్థ తయారు చేస్తుంది. దీంతో రెండు మిలియన్ యెన్లు (సుమారు రూ.12 లక్షలకు పైగా) వ్యయంతో కూడిన జాతి కుక్క ‘కోలీ’ కాస్ట్యూమ్ను ఆ సంస్థ 40 రోజుల్లో తయారు చేసింది. దీనిని ధరించిన టోకో, అచ్చం కుక్కలా మారిపోయాడు. కుక్క మాదిరిగా హావాభావాలు ప్రదర్శించాడు. కుక్క మాదిరిగా నడిచేందుకు కొంత ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియోలను అతడి యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు.
మరోవైపు అచ్చం కుక్కలా ఉన్న టోకో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు.
【制作事例 追加】
犬 造型スーツ個人の方からのご依頼で、犬の造型スーツを制作しました。
コリー犬をモデルにしており、本物の犬と同様に四足歩行のリアルな犬の姿を再現しております🐕詳細はこちら:https://t.co/0gPoaSb6yn#犬 #Dog #着ぐるみ#特殊造型 #特殊造形 pic.twitter.com/p9072G2846
— 特殊造型ゼペット (@zeppetJP) April 11, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Become A Dog
- Dog
- Japanese Man
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

