dog suicide bridge | 70 ఏండ్లలో 600 కుక్కలు ఆత్మహత్య

dog suicide bridge | ఎలైస్కు తన పెంపుడు కుక్క ‘క్యాసీ’ అంటే ఎంతో ప్రేమ. సాయంత్రంపూట ఆ కుక్కను వాకింగ్కు తీసుకెళ్లడం ఆమెకు ఓ దినచర్య. ఈ క్రమంలో ఇద్దరూ ఓ బ్రిడ్జి మీద నుంచి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు. ఒక్కసారిగా క్యాసీ బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకేసింది. హఠాత్పరిణామానికి ఒక్కసారిగా ఎలైస్ కుప్పకూలిపోయింది. ఆ బ్రిడ్జిని ‘డాగ్ సూసైడ్ బ్రిడ్జి’గా పిలుస్తారని, ఆ వంతెన మీదకు కుక్కలను తీసుకెళ్లడం ఎంతమాత్రం మంచిది కాదని తెలుసుకొని ఎలైస్ కంపించిపోయింది. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన 2014లో నిజంగానే జరిగింది. ఇదొక్కటే కాదు.. స్కాట్లాండ్లోని ఓవర్టౌన్ బ్రిడ్జి మీద నుంచి గత 70 ఏండ్లలో దాదాపు 600కు పైగా కుక్కులు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాయి. 50 అడుగుల లోతు, కింద నీళ్లు కూడా ఉండకపోవడంతో 50 కుక్కల వరకు చనిపోయాయి. అందుకే ఈ బ్రిడ్జిని ‘డాగ్ సూసైడ్ బ్రిడ్జి’గా పిలుస్తున్నారు.
ఏమై ఉంటుంది?
ఓవర్టౌన్ బ్రిడ్జి మిస్టరీ తెలుసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ గుట్టును తెలుసుకోలేకపోయారు. ఆ బ్రిడ్జి మీద ఆత్మలు తిరుగుతుంటాయని, కుక్కలు ఆత్మహత్య చేసుకోవడానికి అదే కారణమని కొందరి నమ్మకం. కాగా ఓవర్టౌన్ అనే బ్రిటిష్ మహిళ భర్త 1908లో మరణించాడు. భర్త జ్ఞాపకాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె.. ఆ ఆవేదనతోనే 30 ఏండ్ల తర్వాత మరణించారు. ఆమే ఆత్మ రూపంలో బ్రిడ్జిపై తిరుగుతున్నట్టు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- Dog
- Dog Suicide
- Pintop1
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

