Ayurvedham | పెంపుడు కుక్కలకూ ఆయుర్వేదం!

ఆయుర్వేదం మనుషులకే పరిమితం కాదు. ప్రతి ప్రాణికీ పనికొస్తుంది. ప్రాచీన గ్రంథాల్లో జంతు చికిత్సా విధానాలు కూడా ఉన్నాయి. అప్పట్లో, శాలిహోత్రుడు జంతు వైద్యంలో సుప్రసిద్ధుడు. కుక్కల ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదం కొన్ని చిట్కాలను ప్రస్తావించింది. మనుషుల్లానే కుక్కలు కూడా పరిసరాల్లోని మంచిచెడులను పసిగడతాయి. కొన్నిటికి తీవ్రంగా స్పందిస్తాయి. అలాంటి సందర్భాల్లో వాటికి సాంత్వన కలగడానికి ‘అశ్వగంధ’ ఉపయోగించాలి. మనుషుల కంటే కుక్కల వినికిడి శక్తి చాలా ఎక్కువ. అయితే, కర్ణ కఠోరమైన శబ్దాలు కుక్కల్లో ఉద్రేకానికి కారణం అవుతాయి. ఇలాంటప్పుడు కొన్ని చుక్కల ‘వేపనూనె’ చెవిలో వేసి నెమ్మదిగా రుద్దితే ఉద్రేకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ‘త్రిఫల’ వాడాలి. వీధికుక్కలతో పోలిస్తే పెంపుడు కుక్కలకు చలనం తక్కువ. కాబట్టి వాటి కండరాలు, కీళ్లు సాఫీగా పనిచేయడానికి నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెతో పాదాలకు మర్దన చేయాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Ayurvedham
- dogs
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

