మనుషులే కాదు శునకాలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నాయి.. రీజనేంటో మరి !!

ఒత్తిడికి కుక్కలు కూడా హడలెత్తిపోతున్నాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా వయసు మళ్లిన వాటిలో, కొత్త ప్రదేశానికి వచ్చిన వాటిలో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వాటిలో ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు వెటరినేరియన్ ప్రాచీ క్షత్రియ.
‘శరీరంలో అతిసున్నితంగా ఉండే గుండె.. ప్రతి టిష్యూని తృప్తిపరచడమే కాదు, ఒత్తిడి కలిగినప్పుడు సపోర్టివ్ సిస్టమ్గానూ వ్యవహరిస్తుంది. సాధారణంగా పెద్ద జాతికి చెందిన శునకాలు అంటే… డాబర్మ్యాన్, పిన్చెర్స్, లాబ్రడార్ రిట్రీవర్స్, బాక్సర్స్, గ్రేట్ డేన్స్, జర్మన్ షెపర్డ్స్ కుక్కల్లో నడివయసు రాగానే గుండె సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. అందులో కంజెక్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్, హార్ట్ వాల్వ్ ఇన్సఫీషియెన్సీ, పెరీకార్డియల్ ఎఫ్యూజన్ మొదలైన జబ్బులు కనిపిస్తున్నాయ’ని డాక్టర్ ప్రాచీ అంటున్నారు.
గుండె జబ్బుల బారిన పడుతున్న వాటిలో పదిశాతం నడి వయసులో ఉంటే, అరవై శాతం వయసు మళ్లిన శునకాలు ఉంటున్నాయి. వాటి యజమానులకు ఈ విషయాలపై అవగాహన లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించే వరకు సమస్యను గుర్తించడం లేదు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుక్కలు గుండె జబ్బులతో మరణిస్తున్నాయి. కుక్కల్లో గుండె సమస్యలు ఉన్న విషయాన్ని వాటి ప్రవర్తనను బట్టి అంచనా వేయొచ్చు. దగ్గడం, కొద్దిపాటి నడక లేదా చిన్నచిన్న ఆటలకే అలసిపోవడం, ఎక్కువగా పడుకునే ఉండటం, ఆకలి తగ్గడం, మెట్లు ఎక్కడానికి ఇబ్బందిపడటం, ఒంటరిగా కూర్చోవడం తదితర లక్షణాలు గమనిస్తే వెంటనే వాటికి చికిత్స అందించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- dogs
- Mental Health
- pressure
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

