High Blood Pressure Diet | చాలా రకాల ఆరోగ్య సమస్యలకు మూలకారణం రక్తపోటు. మనం రోజూ తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చని అంటున్నారు నిపుణులు.
› రక్తపోటుకు ప్రధాన కారకం ఉప్పు. దీన్ని వీలైనంత తక్కువగా వాడేందుకు ప్రయత్నించాలి. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన పిండి కంటే ముడిధాన్యాల్ని మరాడించుకుని వాడటం మంచిది.
› చేపలు, చికెన్, పప్పు దినుసులు, తక్కువ కొవ్వు కలిగిన డెయిరీ పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరానికి తగినన్ని ప్రొటీన్లు అందుతాయి. పాలకూర, మెంతికూర, పండ్లు, బ్రకోలీ, అరటి, నిమ్మ వంటి వాటిలోని పొటాషియం శరీరానికి కావలసినంత శక్తిని అందిస్తుంది. వీటిలోని పోషకాలు ఒంట్లో అధిక సోడియంను బయటికి పంపి రక్తనాళాలను శుద్ధి చేస్తాయి.
› వెల్లుల్లి, పెరుగు, గుమ్మడి గింజలు, అవిసెలు, పొద్దుతిరుగుడు గింజలు.. వంటివాటిని నిత్యం తీసుకోవాలి. ఓట్స్, బీట్రూట్, దాల్చిన చెక్క కూడా రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి.
“పుచ్చకాయలను తింటే హైబీపీ సులభంగా తగ్గుతుందట..!”
Blood Pressure : బీపీ పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!”
“నిమిషాల్లో హై బీపీని నియంత్రించే చిట్కాలివే!!”