నిమిషాల్లో హై బీపీని నియంత్రించే చిట్కాలివే!!
అధిక రక్తపోటు దీనిని ఇంగ్లిష్‌లో హై బీపీ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. ఇది నిశ్శబ్ద హంతకి. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కండ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90 నుంచి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుంచి 80 మి.మీ గాను నమోదు కావాలి. రక్త పోటు 130/90 మి.మీ, అంతకన్నా ఎక్కువగా ఉన్నప్ఫుడు అధిక రక్తపోటుగా భావిస్తుంటారు. మనిషి వయసు పెరిగే కొద్ది బీపీలో మార్పు వస్తుంటుంది.
అధిక రక్తపోటు దీనిని ఇంగ్లిష్‌లో హై బీపీ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. ఇది నిశ్శబ్ద హంతకి. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కండ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90 నుంచి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుంచి 80 మి.మీ గాను నమోదు కావాలి. రక్త పోటు 130/90 మి.మీ, అంతకన్నా ఎక్కువగా ఉన్నప్ఫుడు అధిక రక్తపోటుగా భావిస్తుంటారు. మనిషి వయసు పెరిగే కొద్ది బీపీలో మార్పు వస్తుంటుంది.
ఒత్తిడి, ఇన్ఫెక్షన్, కొన్ని రకాల మందులు, శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల రక్తపోటు వస్తుంది. దీనివల్ల గుండె, మూత్రపిండాలు లాంటి అవయవాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అధిక రక్తపోటుతో రక్తనాళాలు దెబ్బతినడం, గుండె సంబంధ సమస్యలు, పక్షవాతం, కిడ్నీజబ్బు లాంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. యువకులు, వృద్ధులపై దీని ప్రభావం ఒకేవిధంగా ఉంటుంది. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు దీనికి ఎక్కువగా గురవుతారు. మీరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లయితే నిమిషాల్లో దాన్ని నియంత్రించడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు.
1.శ్వాస వ్యాయామాలు చేయాలి
కొన్నిసార్లు ఒత్తిడి లేదా ఆందోళన కారణంగా అధిక రక్తపోటు వస్తుంది. ఈ ఉధృతిని తగ్గించేందుకు శ్వాస వ్యాయామాలు చేయాలి. ధీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
2. ఒత్తిళ్లను గుర్తించండి
అధిక రక్తపోటుకు ఒత్తిడి అనేది ప్రధాన కారణం. కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ సమస్యలతోపాటు కొన్ని రకాల ఆహారాలు, మందుల వల్ల కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. దేని వల్ల ఒత్తిడి కలుగుతుందో గుర్తించాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడి వాతావరణం నుంచి దూరంగా జరుగాలి.
3. రోజూ తీసుకునే ఆహారాన్ని పరిశీలించండి
ప్రతిరోజూ మీరు తినే ఆహారాన్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఉప్పగా ఉండే ఆహారాలు లేదా ప్యాక్ చేసిన, సోడియం అధికంగా ఉన్న ప్రాసెస్డ్ పదార్థాలు తీసుకుంటుంటే వెంటనే మానేయాలి. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. దాని స్థానంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి.
4.ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి
ఆల్కహాల్ కాలక్రమేణా రక్తపోటును కూడా పెంచుతుంది. సగటున పురుషులు, మహిళలు ఇద్దరికీ వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ మద్యం తీసుకుంటే కచ్చితంగా హై బీపీ బారిన పడుతారని హెచ్చరిస్తున్నారు. అందుకే మద్యానికి బానిసలైనవారు వెంటనే మానేయడం మంచిది.
5. కెఫిన్ ఉన్న డ్రింక్స్ తాగడం తగ్గించుకోవాలి
కెఫిన్ కలిగిన పానీయాలను తరచుగా తాగడం అలవాటు చేసుకుంటే హైబీపీ పెరిగిపోతుంది. ఎనర్జీ డ్రింక్స్ నుంచి కాఫీ వరకు అన్నింట్లో కెఫిన్ ఉంటుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగొద్దు. శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా రోజులో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతుండాలి.
6. ధూమపానం మానేయాలి
ధూమపానం రక్త నాళాలను త్వరితగతిన కుదించి, తద్వారా రక్తపోటును విపరీతంగా పెంచుతుంది. ఇది అధిక రక్తపోటుకు ప్రత్యక్ష కారణం కాదు. అయినప్పటికీ, హై బీపీ ఉన్నవాళ్లకు ఇది అత్యంత ప్రమాదకరం. అందుకే ధూమపానం అలవాటు ఉంటే వెంటనే మానేయాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

