e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News Blood Pressure : బీపీ పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!

Blood Pressure : బీపీ పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!

పెరుగుతున్న రక్తపోటు ఇటీవలి కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలను తీసుకొస్తున్నది. ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అరికట్టవచ్చునని, అలాగే గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా దోహదం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఒక నివేదికను ప్రచురించారు. ‘ఆంథోసైనిన్స్, కొన్ని ఫ్లేవోన్, ఫ్లావాన్-3-ఓల్ సమ్మేళనాలు రక్తపోటు నివారణకు దోహదం చేస్తాయి’ అని ఈ అధ్యయనంలో గుర్తించారు.

- Advertisement -

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అరోగ్య సమస్యల్లో హైబీపీ (Blood Pressure)ఒకటి. 30 ఏండ్ల వయసు కూడా నిండని వారు సైతం రక్తపోటుతో బాధపడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆనారోగ్య అలవాట్ల కారణంగా రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. ఒక్కసారి హైబీపీ ఎటాక్​ అయ్యిందంటే జీవితాంతం నిత్యం మందులు వేసుకోవాల్సిందే. ఇది క్రమంగా హృదయ సంబంధ రోగాలకు కూడా దారి తీస్తుంది. అందుకే, హైబీపీ రాకుండా అత్యంత జాగ్రత్త వహించాలి. మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో హైబీపీని కంట్రోల్​ చేసుకోవచ్చు. ముఖ్యంగా బెర్రీలు, యాపిల్స్, బేరి, రెడ్ వైన్ వంటి ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే పండ్లు, పానీయాలతో సిస్టోలిక్ రక్తపోటు స్థాయి తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు కలిగి ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివని సెలవిస్తుంటారు పోషకాహార నిపుణులు.

టీ

ఈ వేడి పానీయంలో పాలీఫెనోలిక్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. టీని నిత్యం ఉదయాన, సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకోకుండా చూడాలి.

యాపిల్స్

ఈ ఇష్టమైన పండులో ఫ్లేవనాయిడ్స్ మూడు విభిన్న సబ్ క్లాస్ ఉన్నాయి. ఫ్లేవొనోల్స్, ఫ్లేవోన్స్, ఫ్లేవనోల్స్. ఇవి సహజ పదార్ధాలతో సమృద్ధిగా ఉండి రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి.

ఆరెంజ్‌

100 గ్రాముల నారింజలో దాదాపు 19.6 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్‌ల ఆగ్లైకోన్‌లు ఉంటాయి. ఒక రోజులో తాజాగా పిండిన ఆరెంజ్ తీసుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలు

బెర్రీలు కొన్ని రకాల ఫ్లేవనాయిడ్‌లకు గొప్ప మూలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు తినడం ద్వారా ఆంథోసైనిన్, కాటెచిన్, క్వెర్సెటిన్, కెంఫ్‌ఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్లు లభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా సహాయపడి.. రక్తపోటును నియంత్రిస్తాయి.

కాలే

ఈ ఆకుపచ్చ ఆకు కూర ఒక వరం వంటిది. ఇది ఇతర కూరగాయల కంటే ఎక్కువ ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది. శరీరంపై ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో రకాలుగా కాలేను ఆహారంగా తీసుకోవచ్చు. పలు వంటకాల్లో వేసుకుని తినడం వల్ల ఎన్నో ఫ్లేవనాయిడ్లు మన శరీరానికి అందుతాయి.

ఉల్లిపాయలు

ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్, ప్రధానంగా ఆంథోసైనిన్స్, క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనోల్స్‌లను ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహారానికి రుచిని ఇవ్వడంతోపాటు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. సూప్ నుంచి కబాబ్‌ల వరకు.. ఉల్లిపాయలు ఎక్కడైనా సరిపోతాయి.

రెడ్ క్యాబేజీ

సైనైడింగ్, ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ ప్రధాన పోషకాలు ఎర్ర క్యాబేజీలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి యాంటీఆక్సిడెంట్లుగా సేవలందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటుతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకంగా ఆనందించే క్యాస్రోల్ వంటకం ఇది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ట్రిబ్యునల్స్‌ ఖాళీలు భర్తీ చేయకపోవడంపై ‘సుప్రీం’ ఆగ్రహం

బ్రిటన్‌ ఎంపీలకు కొత్త డ్రెస్‌ కోడ్‌

తేజ్‌ ప్రతాప్‌ ‘స్టూడెంట్‌ జన్‌శక్తి పరిషత్‌’ ప్రారంభం

తాలిబాన్‌ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య

లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు

107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement