Taliban Brutal face : తాలిబాన్ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య
Taliban Brutal face : తాజాగా మాజీ మహిళా పోలీసు అధికారిని దారుణంగా హత్య చేశారు. ఎనిమిది నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను పాశవికంగా చంపడంపై సర్వత్రా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. దాంతో...

కాబూల్ : ప్రపంచం భయపడుతున్నట్లుగానే ఆఫ్ఘనిస్తాన్‌లో అరాచకం (Taliban Brutal face) మొదలైంది. తమకు కాదని అప్పటి ప్రభుత్వానికి, అమెరికా సేనలకు బాసటగా నిలిచిన వారిని తాలిబాన్ టార్గెట్ చేసుకుంటున్నది. ఇప్పటికే పలువురిని గుర్తించినట్లు వార్తలు రాగా.. తాజాగా మాజీ మహిళా పోలీసు అధికారిని దారుణంగా హత్య చేశారు. ఎనిమిది నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను పాశవికంగా చంపడంపై సర్వత్రా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. దాంతో ఘటనను ఖండిస్తున్నట్లు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించడమే కాకుండా.. విచారణ జరుపుతామని వెల్లడించారు.
ఘోర్ ప్రావిన్స్‌లోని ఫిరోజ్కోహ్లో నివాసముందే బాను నిగర్ గతంలో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భవతి. గతంలో ప్రభుత్వానికి తమపై ఫిర్యాదు చేసేవారన్న కోపంతో ఆమెను తాలిబాన్ మట్టుబెట్టినట్లు బీబీసీ తన కథనంలో పేర్కొన్నది. కుటుంబసభ్యులు చూస్తుండగానే ఆమెను వీధిలోకి లాక్కొచ్చి తుపాకీతో తలపై కాల్చి చంపారని, ఆమెను లాక్కొచ్చిన ముగ్గురు అరబిక్ భాషలో మాట్లాడినట్లు స్థానికులు చెప్పారని బీబీసీ తెలిపింది. ఈ వీడియోను పదేపదే ప్రదర్శిస్తూ తమకు వ్యతిరేకంగా నడుచుకునే వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. షరియత్ చట్టం ప్రకారమే మహిళలు నడుచుకోవాలని తాలిబాన్ ఆదేశిస్తున్నది. అయితే, ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవడంతో ఖండిస్తున్నట్లు తాలిబాన్ ప్రకటించింది. అలాగే, దీనిపై విచారణ జరుపుతామని కూడా పేర్కొన్నది.
1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘన్‌ను పాలించిన తాలిబాన్.. మహిళలకు విద్యతో పాటు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. శనివారం కాబూల్‌లో వందలాది మంది మహిళలు తాలిబాన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు
ఈ నెల 15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర
ఏవీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

