20 years of TRS | KCR | ఉద్యమంలో కేసీఆర్ ప్రత్యర్థులను తిట్టలేదా? ఇప్పుడు మేం ఆయన్ను తిడితే తప్పేమిటి? ఇదీ కొందరు అజ్ఞానులు చేసుకునే సమర్థన. ఉద్యమం మొదలుపెట్టిన నాడు అన్నీ ప్రతికూలతలే. జనంలో అవిశ్వాసం. ముక్కచెక్కలుగా తెలంగాణ సమాజం, పార్టీల సహకార లేమి, కేంద్రం సహాయ నిరాకరణ, రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు. మీడియా అంతా ఆంధ్రా చేతుల్లో! ఇన్ని ఇబ్బందుల నడుమ తెలంగాణ భావజాల వ్యాప్తికి కేసీఆర్ అనేక ఎత్తుగడలను ఎంచుకున్నారు.
తెలంగాణ సాంస్కృతిక రూపాలను ఉద్యమంలోకి తేవడం, తరచూ ఉప ఎన్నికలు సృష్టించడం, అవతలి పార్టీ అవసరాలతో బేరాలాడి పొత్తులు పెట్టుకోవడం… ఇలా ఎన్నో. ఈ ఎత్తుగడల్లో ఒకటి తిట్లు. ఉద్యమం ఎంత ఉధృతంగా జరిగినా (ఆంధ్రా) మీడియాలో దానికి పెద్దగా కవరేజీ వచ్చేదే కాదు. దీంతో వాళ్ల వేలితోనే వాళ్ల కన్ను పొడిపించే వ్యూహంతో కేసీఆర్, ఆంధ్రా సంస్కృతి తెలంగాణకు చేసిన నష్టాన్ని పతాక శీర్షికలకు ఎక్కించారు. ఎవని తెలుగు తల్లి? ఎక్కడి తెలుగు తల్లి?… ఆంధ్రా బిర్యానీ పెంటలాగా ఉంది… లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులే… ఉల్వ చారు మాకెందుకు తెల్వదు, ఉల్వల్ని మేం బర్లకు పెడతం… ఇలా కేసీఆర్ తిట్లతో తెలంగాణపై ఆంధ్రాతో పాటు, దేశవ్యాప్తంగా చర్చ జరగడమే కాదు; తెలంగాణ సమాజంలోనూ మంచి కిక్కు వచ్చింది. దాడులతో కాదు; మాటలతో భయపెట్టే కేసీఆర్ ఎత్తుగడ ఫలించింది.
14 ఏండ్లు కళాకారుల వెంట ఉన్నా. కష్టాలు, కన్నీళ్లు పంచుకున్నం. ఏ పరిస్థితి వచ్చినా ధైర్యం వీడకుండా నడిచిండ్రు.. అందరినీ తట్టి లేపిండ్రు.. తెలంగాణ తెచ్చిండ్రు.. కళాకారులు ఒక తుఫాన్.. ఒక శక్తి.. వారిని గుండెల్లో పెట్టుకోవాలె. తెలంగాణ గెలువాలె.. ఆ ఆత్మ స్థయిర్యం వారే ఇవ్వాలె. తెలంగాణను ముందుకు తీసుకుపోవాలె.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
KCR | జోక్ వేసాడంటే.. పొట్ట పగలాల్సిందే..
CM KCR | కేసీఆర్‌కు నచ్చిన పుస్తకం ఏంటో తెలుసా