‘ఉద్యమ పంథా వీడను. ప్రాణం పోయినా బిగించిన పిడికిలి విడువను. ఎత్తిన జెండా దించను. కచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. ఒకవేళ నేను పెడమార్గం పడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. నేను దృఢమైన సంకల్పంతోని, కచ్చితంగా సాధించాలనే సదుద్దేశంతోని ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఇంటికి ఒక్క యువకుడిని నాకు అప్పచెప్పండి. వందశాతం తెలంగాణ రాష్ట్రం సాధిస్తా.’
– 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ టీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్ ఆశ్వాసన
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జ పై
నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం
బొకచోఁ బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయఁడు కార్య సాధకుఁడు దుఖ్ఖంబున్ సుఖంబున్ మదిన్!!
‘నాతోని యాడాది గూసున్నడాయన నేర్చుకోడానికి. ప్రతిదానికి క్వశ్చన్, క్రాస్ క్వశ్చన్ జేస్తుండె. సమస్యను అర్థం జేసుకొని, ప్రజల భాషతో ప్రజల్లోకి ముందుకు దీసుకుపోయినటువంటి.. ఏకైక నాయకుడు చంద్రశేఖర్‌రావు వొక్కడే. నిజంగ ప్రజల నుడికారంలో పోగలిగినటుంటి రాజకీయ నాయకుల్లో ఏకైక నాయకుడు ఈనాటికీ చంద్రశేఖరరావు వొక్కడె’
– ప్రొఫెసర్ జయశంకర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
నాటికీ నేటికీ ఏకైక నాయకుడు కేసీఆర్
KCR | నిత్య విద్యార్థి.. నిరంతర అధ్యయనం