నిత్య విద్యార్థి.. నిరంతర అధ్యయనం
- జీవితమే ఒక అధ్యయనం
- ముఖే ముఖే సరస్వతి.. అని నమ్ముతారు
- మనుషులనూ చదువుతారు.
- ప్రతి నిర్ణయం వెనుకా లోతైన పరిశోధన
- అతి వేగంగా ఆకళింపు

ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ను కలుస్తున్న మేధావులు పదేపదే చెప్పే మాట – హి ఈజ్ ఏ గుడ్ లర్నర్. ఆయన పుస్తకాలు మాత్రమే చదువరు. సమాజాన్ని చదువుతారు. మనుషులను చదువుతారు. సమస్యలను చదువుతారు. సమస్యల మూలాలను చదువుతారు. పరిష్కారాలు సాధిస్తారు. అందుకే కేసీఆర్ నిరంతర అధ్యయనశీలి. పల్లెటూరికి పోతే అక్కడి పరిస్థితులను ఆయన అధ్యయనం చేస్తారు. ఒక పేదవాడు కనిపిస్తే, అతడి కష్టసుఖాలను, జీవన పరిస్థితులను తెలుసుకుంటారు. కాలంతో మారుతున్న పరిస్థితులను వేగంగా గ్రహిస్తారు. అతివేగంగా ఆకళింపు చేసుకోవడం ఆయనకున్న అరుదైన శక్తి. ఆయన పథకాలన్నీ ఉద్యమకాలపు అనుభవాల ఫలితమే. కల్యాణ లక్ష్మి మొదలుకొని ప్రతి పథకం వెనుక ఆయన అధ్యయనం నిక్షిప్తమై ఉంటుంది. ఆయన ప్రవేశ పెట్టిన దళిత బంధు, రైతు బంధు వంటి ప్రతి పథకమూ తరచి చూస్తే, అంతర్జాతీయ అధ్యయనాలు, సూచనల ప్రకారం శాస్త్రీయమైనదిగా తేలుతుంది. అందుకే మన పథకాలకు ఇంతటి ప్రశంసలు, ఆసక్తి వ్యక్తమవుతున్నాయి. ఆచరణలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. అనేక మంది ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలు, విధానకర్తలు సమష్టిగా ఎంతోకాలం తర్జన భర్జన చేస్తే తప్ప పట్టుబడని ఈ అభివృద్ధి రహస్యాలను కేసీఆర్ ఆకళింపు చేకోవడమేమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది.
‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలిపరమానంద.. రామగోవిందా’వంటి జోలపాటలతో తల్లి తన బిడ్డ గోవిందుడు, అచ్యుతుడు కావాలని కోరుకుంటుంది. జోలపాటల నుంచే తెలుగు తీయదనాన్ని పసిబిడ్డలు ఆస్వాదిస్తారని చెప్పడానికి ఇవి ఉదాహరణలు.
– కేసీఆర్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 20 Years Of TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

