T20 World Cup 2024 : ఈ ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణ పెద్ద తలనొప్పిగా మారింది. మెగా టోర్నీకి మరో రెండు నెలలే ఉన్నప్పటికీ వేదక ఎక్కడ? అనేది మాత్రం ఫిక్స్ కాలేదు. మహిళల ప్రపంచ కప్ ఆతిథ్యానికి బీసీసీఐ (BCCI) సిద్ధంగా లేకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దిక్కుతోచని స్థితిలో పడింది. చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్నే నమ్ముకున్న ఐసీసీకి గుడ్న్యూస్.
వరల్డ్ కప్ పోటీలను నిర్వహించేందుకు జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆసక్తి చూపిస్తోంది. తటస్థ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆ దేశ బోర్డు వెల్లడించింది. ఐసీసీ అనుమతిస్తే.. హరారే స్పోర్ట్స్ క్లబ్లో కొన్ని మ్యాచ్లు ఆడించేందుకు తయారుగా ఉన్నామని జింబాబ్వే తెలిపింది.
News :-
Zimbabwe express interest in hosting Women’s T20 World Cup 2024.
[ Source – ESPNCricinfo ] pic.twitter.com/1xErTqfu44
— Jay Cricket. (@Jay_Cricket18) August 16, 2024
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెలలో టీ20వ వరల్డ్ కప్ జరగాలి. అయితే.. ఆతిథ్య హక్కులు దక్కించుకున్న బంగ్లాదేశ్ (Bangladesh)లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. హింసాత్మక దాడులతో అట్టుడ్డుకుతున్న బంగ్లాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు.
దాంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వరల్డ్ కప్ వేదికను తరలించే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే బీసీసీఐని ఐసీసీ సంప్రదించింది. అయితే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఐసీసీకి హ్యాండిచ్చింది. దాంతో, యూఏఈ, శ్రీలంకలను ప్రత్నామ్యాయ వేదికలుగా ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటోంది.