Yuvraj Singh | యువరాజ్ దంపతులకు పండంటి పాప.. పేరేంటో తెలుసా?
Yuvraj Singh : భారత మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్(Yuvraj Singh) రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య హజల్ కీచ్(Hazel Keech) ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చింది. దాంతో, యూవీ పట్టలేనంత సంబురంలో ఉన్నాడు. ఈ జంటకు 2022 జనవరిలో బాబు (Orian) పుట్టాడు. ఇప్పుడు పాప జన్మించింది. దీంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని యువీ సోషల్ మీడియా....
Yuvraj Singh : భారత మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్(Yuvraj Singh) రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య హజల్ కీచ్(Hazel Keech) ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చింది. దాంతో, యూవీ పట్టలేనంత సంబురంలో ఉన్నాడు. ఈ జంటకు 2022 జనవరిలో బాబు (Orian) పుట్టాడు. ఇప్పుడు పాప జన్మించింది. దీంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని యువీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హజల్ కీచ్ బాబును చూసుకుంటుండగా.. చిన్నారి పాపాయిని ఎత్తుకున్న యువీ ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
‘నిద్రలేని రాత్రులు ఎదురవుతున్నా.. ఈ ఆనందం వెలకట్టలేనిది. ఎంతో సంతోషంగా ఉంది. మా కూటుంబంలోకి చిట్టి తల్లి ‘ఔరా’(Oura)ని ఆహ్వానించాం. తన రాకతో కుటుంబం పరిపూర్ణమైంది’ అని యువీ రాసుకొచ్చాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిన తానిప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నానని వెల్లడించాడు.
Sleepless nights have become a lot more joyful as we welcome our little princess Aura and complete our family ❤️ @hazelkeech pic.twitter.com/wHxsJuNujY
— Yuvraj Singh (@YUVSTRONG12) August 25, 2023
ఆల్‌రౌండర్‌గా యూవీ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. 2011 వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2011)లోనూ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. టీమిండియాకు రెండోసారి ట్రోఫీ దక్కడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. అయితే.. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడ్డ యువీ కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు. తానొక పోరాట యోధుడని నిరూపించుకున్నాడు. మోడల్‌గా, బాలీవుడ్ కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హజల్ కీచ్‌ను యూవీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట 2016 నవంబర్ 30న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఇవి కూడా చదవండి
Virat Kohli | కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్!.. మరోసారి అలా చేయొద్దంటూ మందలింపు
WWE Champion Death | 36 ఏళ్లకే నేలకొరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Hazel Keech
- odi wc 2011
- Orian
- oura
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

