WWE Champion Death : అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ రెజ్లర్ వింధామ్ రొటుండా(Windham Rotunda) కన్నుమూశాడు. బ్రే వ్యాట్(Bray Wyatt)గా ప్రసిద్ది చెందిన అతను 34 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచాడు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటైర్టైన్మెంట్ (WWE)లో మూడు సార్లు చాంపియన్ అయిన వ్యాట్ అకాల మరణంతో అభిమానులు షాక్ అయ్యారు. చిన్నవయసులోనే వ్యాట్ ప్రాణాలు విడవడంతో డబ్ల్యూడబ్ల్యూ స్టార్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరణ వార్తను డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిప్లే హెచ్(Triple H) సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు.
‘ఇప్పుడే నాకు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యుడు మైక్ రొటుండా నుంచి ఫోను వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబంలో ఒకడైన వింధామ్ రొటుండా మరణించాడనే విషయం చెప్పాడు. ఈ కష్ట సమయంలో మా ప్రార్ధనలు వాళ్ల ఫ్యామిలీతో ఉంటాయి’ అని ట్రిప్లే తెలిపాడు. వ్యాట్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అతడి భార్య పేరు జోసియన్ అఫెర్మన్. ఆమె ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్ అనౌన్సర్.
Just received a call from WWE Hall of Famer Mike Rotunda who informed us of the tragic news that our WWE family member for life Windham Rotunda – also known as Bray Wyatt – unexpectedly passed earlier today. Our thoughts are with his family and we ask that everyone respect their…
— Triple H (@TripleH) August 24, 2023
WWE is saddened to learn that Windham Rotunda, also known as Bray Wyatt, passed away on Thursday, Aug. 24, at age 36.
WWE extends its condolences to Rotunda’s family, friends and fans. pic.twitter.com/pabVuaKlnP
— WWE (@WWE) August 24, 2023
వ్యాట్ 2009 డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టాడు. అయితే.. 2014లో రెజ్లర్‌గా అతడి కెరీర్ మలుపు తిరిగింది. అదే ఊపులో వ్యాట్ 2017లో చాంపియన్‌గా అవతరించాడు. రింగ్‌లో విచక్షణరహితంగా ప్రత్యర్థులపై విరుచుకుపడే అతను కొంతకాలంగా ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకనే ఫిబ్రవరి నుంచి రింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే.. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే రింగ్‌లో అడుగు పెడతానని వ్యాట్ అన్నట్టు కొందరు చెప్తున్నారు. కానీ, అంతలోనే వ్యాట్ మరణ వార్త వినాల్సి వచ్చిందంటూ డబ్ల్యూడబ్ల్యూఈ, బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు.